లోక్ సభ బరిలో సీపీఎం..భువనగిరి స్థానం ఫై పోటీ

తెలంగాణ లో ఎన్నికల జోరు మొదలైంది. మే 13 న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు మొదలుపెట్టాయి. ఇప్పటీకే అధికార పార్టీ కాంగ్రెస్ , బిఆర్ఎస్ , బిజెపి తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తూ ఉండగా..తాజాగా సిపిఎం కూడా బరిలోకి దిగాలని చూస్తుంది.

లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని సీపీఎం యోచిస్తోంది. మల్లు లక్ష్మి, నంద్యాల నర్సింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలలో ఒకరిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికతో పాటు రాష్ట్రంలోని మిగతా స్థానాల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపై పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.