రేపల్లెలో అత్యాచారం ఘటన బాధాకరం : మంత్రి రజని

నిందితులకు ఉరి శిక్ష పడే వరకు వదిలేది లేదు

AP Minister Vidadala Rajani
AP Minister Vidadala Rajani

Amaravati: రేప‌ల్లె రైల్వే స్టేష‌న్ లో మ‌హిళ‌పై అత్యాచార ఘ‌ట‌న అత్యంత బాధాక‌రమని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల రజని అన్నారు . నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డే వ‌ర‌కు ప్ర‌భుత్వం వ‌దిలిపెట్ట‌ద‌ని హెచ్చ‌రించారు . ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని రేప‌ల్లె ఆస్ప‌త్రి అధికారుల‌ను ఆదేశించామన్నారు. ప్ర‌స్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది ప‌ర్యవేక్ష‌ణ‌లో ఉందని బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుందన్నారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/