వరికి గిట్టు బాటు ధర అడిగినందుకు.. రైతును చెప్పుతో కొట్టబోయిన వైసీపీ ఎమ్మెల్యే

వినుకొండ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తరుచు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా అలాగే నిలిచాడు. వరికి గిట్టుబాటు ధర ఇప్పించాడని అడిగినందుకు ఓ రైతును చెప్పుతో కొట్టబోయాడు. ఈ ఘటన గురువారం జరుగగా..కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

వినుగొండ నియోజక వర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో.. వైసీపీ కి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడు ఈ మధ్యనే మరణించారు. ఈ క్రమంలో సదరు కుటుంబాన్ని పరామర్శించడానికి లావు కృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడు ఆ గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో ఓ రైతు వరికి గిట్టు బాటు ధర లేదని… వైసీసీ సర్కార్‌ ఏర్పాటు చేసిన ఆర్‌బీకే ల ద్వారా కొనడం లేదని సదరు రైతు కృష్ణదేవరాయలు విన్నవిస్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడు ఆ రైతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంపీ ఎదుటే తన కాలికి ఉన్న చెప్పుతో… రైతును కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే… సదరు రైతు ధైర్యంగా ఎదురు తిరిగాడు. గురువారం ఈ సంఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుండడం ఎమ్మెల్యే ఫై అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొల్ల బ్రహ్మన్నాయుడు కు ఇలాంటివి కొత్తమీ కాదని , తరుచు ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడని అంత విమర్శిస్తున్నారు.