నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ49

కొన్ని నిమిషాల పాటు ప్రయోగం వాయిదా

India’s PSLV-C49 with latest earth observation satellite EOS-01, 9 others lift off

శ్రీహరికోట: శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్సేస్‌ సెంటర్‌ షార్‌ నుండి ఈరోజు మ‌ధ్యాహ్నం 3.10 నిమిషాల‌కు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ నింగికి ఎగిరింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్‌1 శాటిలైట్‌తో పాటు మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లు నింగిలోకి దూసుకువెళ్లాయి. పీఎస్ 1 ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింది. పీఎస్‌2 కూడా నార్మ‌ల్‌గా కొన‌సాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్న‌ట్లే స‌రేట్ అయ్యింది. పీఎస్ఎల్వీ బ‌రువు 290 ట‌న్నులు. ఇవాళ ఉద‌యం పీఎస్‌2 రెండ‌వ ద‌శ‌లో ఆక్సిడైజ‌ర్ ఫిల్లింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్ EOS-01తో…. వ్య‌వ‌సాయం, అట‌వీ, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అప్లికేష‌న్లు ప‌రిశీలించ‌నున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం క‌స్ట‌మ‌ర్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించారు. అయితే మధ్యాహ్నం 3.02 గంటలకు నింగిలోకి దూసుకెళ్లాల్సిన పీఎస్ఎల్వీ సీ49 కొన్ని నిమిషాల ఆలస్యంగా నింగిలోకి దూసుకెళ్లింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/