కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్..

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మే 6,7వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఓయూలో పర్యటిస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే దీనికి ఓయూ వీసీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో అనుమతివ్వాలంటూ.. నిన్న ఓయూలో విద్యార్థులు డిమాండ్ చేయగా..ఈరోజు మునిస్టర్స్ ముట్టడించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సెక్షన్ 151 కింద కూడా పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
జగ్గారెడ్డిని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని సమాచారం అందుతోంది. ఇక అటు ఓయూ వీసీ చాంబర్ ను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ముట్టడించారు. రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ.. రాహుల్ గాంధీ సభకు అస్సలు అనుమతి ఇచ్చేదేలే అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.