చిరంజీవి గొప్ప నిర్ణయం..సినీ కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణం

chiranjeevi special hospital for film workers

మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని చిరంజీవి నిర్మించబోతున్నట్లు తెలిపారు. చిరంజీవి గారు పెద్ద ఆస్పత్రి కట్టాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. చిత్రపురిలోని పాఠశాలు, ఆస్పత్రికి కావల్సిన స్థలం ఉందని.. చిరంజీవి గారు చిత్రపురి స్థలంలో ఆస్పత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మే డే వచ్చిదంటే యావత్ ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటుందని… 24 విభాగాలకు సంబంధించిన లక్షలాది మంది కార్మికులు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తోందని… తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా చిరంజీవి ఉన్నారన్నారు. అలాగే ఇళ్లు లేని సినీ కార్మికులకు రాబోయే కాలంలో చిత్రపురిలో ఇళ్లు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.