పవన్ ఛాన్స్ ఇస్తే..జనసేన నుండి పోటీకి సిద్ధం అంటున్న రంగస్థలం ఫేమ్ మహేష్

రంగస్థలం ఫేమ్ మహేష్ ..పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే జనసేన నుండి పోటీ చేస్తానని తెలిపారు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయినా మహేష్..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విశేషాలు తెలుపుతూ..రాజకీయాల ఫై స్పందించారు.

జనసేన పార్టీ గనుక తనకు టికెట్‌ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పవన్ కల్యాణ్​ది చాలా గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానన్నారు మహేష్. అంతే కాదు ఆయన గొప్ప మనస్తత్వం గురించి చెపుతూ.. మూవీ సెట్స్​లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో, ఏం తింటారో కూడా చెప్పుకొచ్చాడు. తన ఊరిలో పవన్ కల్యాళ్ అభిమానుల ఎక్కువగా ఉన్నారని. జనసేన కోసం స్థానికంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని మహేష్ తెలిపారు. దేవుడి దయ వల్ల పార్టీ తరఫున తనకు పోటీచేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా నిలబడతానన్నారు. ఇప్పుడు మాత్రం తన ఆసక్తి మొత్తం సినిమాల మీదే ఉందని మహేష్​ వివరించారు.