మెగాస్టార్ మూవీ లో ధమాకా బ్యూటీ..?

ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల..ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా జోడి కడుతూ వస్తుంది. రీసెంట్ గా రవితేజ సరసన ధమాకా మూవీ లో నటించింది. ప్రస్తుతం రామ్ , నితిన్ , వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ ల సరసన నటిస్తుంది. అలాగే సీనియర్ నటుడు బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే చిత్రంలో బాలకృష్ణ కూతురి గా నటించబోతుంది. ఇలా వరుస సినిమాల తో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ..తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.

సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మరో యంగ్ హీరో సిద్దు జొన్నళగడ్డ నటించబోతున్నాడు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ మూవీలో సిద్దుకి పెయిర్ గా శ్రీలీలని తీసుకొనున్నారట. ఇలా వరుస ఛాన్సుల తో శ్రీ లీల బిజీ గా మారడం అభిమానులను తెగ సంబర పెడుతుంది.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది.