హోరాహోరీగా అధ్యక్ష ఎన్నికలు

14 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం

joe biden- trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు శరవేగంగా సాగుతుండగా, ఇప్పటివరకూ జో బైడెన్ 126, డొనాల్డ్ ట్రంప్ 89 ఎలక్టోరల్ ఓట్లను పొందారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు 12 రాష్ట్రాల్లో బైడెన్, 14 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. పెద్ద రాష్ట్రాల ఫలితాలు వెల్లడికావాల్సి వుంది. కీలకమైన ఫ్లోరిడాలో ట్రంప్ కు బైడెన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

ఇక, డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలను, ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే, అలబామా (9), అర్కాన్సాస్ (6), ఇండియానా (11), కెంటుకీ (8), లూసియానా (8), మిసిసిపీ (6), నార్త్ డకోటా (3), ఓక్లాహామా (7), సౌత్ కరోలినా (9), సౌత్ డకోటా (3), టెన్నిస్సీ (11), వెస్ట్ వర్జీనియా (5), వ్యోమింగ్ (3) ఉన్నాయి.

ఇక బైడెన్ గెలిచిన రాష్ట్రాలు, ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే, కొలరాడో (9), కనెక్టికట్ (7), డెలావర్ (3), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (3), ఇల్లినాయిస్ (20), మేరీల్యాండ్ (10), మసాచుసెట్స్ (11), న్యూజర్సీ (14), న్యూయార్క్ (29), రోడ్ ఐలాండ్ (4), వెర్మాంట్ (3), వర్జీనియా (13) ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/