వరంగల్ గడ్డ సాక్షిగా వాళ్లకు మాస్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..వరంగల్ గడ్డ సాక్షిగా మెగా ఫ్యామిలీ ని తక్కువ చేసి మాట్లాడిన వారికీ మెగా వార్నింగ్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో అపశృతి చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి – శృతి హాసన్ జంటగా మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. కేవలం రెండు వారాల్లోనే రూ. 200 కోట్లు క్రాస్ చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా భారీ విజయం సాధించడం తో మైత్రి మూవీ మేకర్స్ చిత్ర సక్సెస్ మీట్ ను ఈరోజు శనివారం హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అట్టహాసంగా నిర్వహించారు.

ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు , రాజకీయ ప్రముఖులు సైతం హాజరై సందడి చేసారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గురించి , అందులో నటించిన నటి నటులు , పనిచేసిన టెక్నీకల్ టీం అందరికి పేరు పేరున విషెష్ అందించారు. ఇక తన స్పీచ్ చివరిలో మాత్రం ఓ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. చిరంజీవి గారిని ఏమైనా అంటే ఆయన సైలెంట్ గా ఉంటారేమో..మీము మాత్రం ఆలా సైలెంట్ గా ఉండాం..గుర్తించుకోండి అంటూ ఎవరికీ ఇవ్వాలో వాళ్లకు ఇచ్చాడు. రీసెంట్ గా వైస్సార్సీపీ మంత్రి రోజా మెగా ఫ్యామిలీ ఫై చిరంజీవి ఫై పలు వివాదస్పద కామెంట్స్ చేయడం తో చరణ్ వార్నింగ్ ఆమెకే అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.