తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మరో బిజెపి ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణాముల్ కాంగ్రెస్(TMC) భారీ విజయం సాధించడంతో బిజెపి పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యే లు ఒక్కొక్కరిగా బిజెపికి గుడ్ బై చెప్పి తృణాముల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. గత రెండు రోజుల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీఎంసీ లో జాయిన్ అవ్వగా..ఇప్పుడు మరో బిజెపి ఎమ్మెల్యే ఆ పార్టీ కి రాజీనామా చేసి టీఎంసీ లో చేరారు.

బీజేపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, కౌన్సిలర్ మనతోష్ నాథ్‌లు కోల్‌కత్తాలో జరిగిన కార్యక్రమంలో టీఎంసీ కండువాలు కప్పుకున్నారు. కొన్ని అపార్థాల కారణంగా గతంలో కొన్ని మార్పులు జరిగాయని కానీ ఇపుడు తిరిగి తన ఇంటికి చేరుకున్నానంటూ ఈ సందర్భంగా బిశ్వజిత్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్ లు టీఎంసీ లో చేరగా ఇప్పుడు బిశ్వజిత్ దాస్ చేరిక తో మమతా కు మరింత బలం చేకూరినట్లు అయ్యింది.