చైతు తో ప్రేమ వ్యవహారం ఫై మజిలీ హీరోయిన్ క్లారిటీ

సమంత కు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య పలువురు హీరోయిన్లతో ప్రేమ వ్యహారం సాగిస్తున్నట్లు అనేక రూమర్స్ ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఎక్కువగా శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని కొన్ని రోజుల పాటు విపరీతంగా ప్రచారం అయ్యింది. ఆ తర్వాత మజిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పేరు వైరల్ గా చక్కర్లు కొడుతూ వస్తుంది. దివ్యాంశ కౌశిక్ తో నాగచైతన్య ప్రేమాయణం సాగిస్తున్నాడని , వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా పలురకాల వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వస్తున్నాయి.

ఈ తరుణంలో దివ్యాంశ కౌశిక్ ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చింది. నాగచైతన్య చాలా బాగుంటాడని.. ఐలవ్ చై అని చెప్పింది. అతనిపై తనకు క్రష్ ఉందని… అయితే, తాము పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో తనకు ఛాన్స్ రావడానికి నాగచైతన్య కారణమనే వార్తల్లో కూడా నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.