స్టాన్ క్రియేటర్ ఫెస్ట్‌ లో గేమింగ్ క్రియేటర్స్ సందడి

Gaming creators buzz at Stan Creator Fest

హైదరాబాద్ : భారతదేశ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ స్టా ర్టప్ స్టాన్ భారతదేశంలోని గేమింగ్ క్రియేటర్ల విజయాలను పురస్కరించుకుని మొట్టమొదటి మెగా ఈవెం ట్ స్టాన్ క్రియేటర్ ఫెస్ట్‌ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ ఎనిగ్మా ది ఎక్స్‌ పీరియన్స్ (జూబ్లీ హిల్స్, హైద రాబాద్‌)లో జరిగింది. దేశవ్యాప్తంగా 500+ కంటే ఎక్కువ మంది క్రియేటర్‌లు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
ఈ క్రియేటర్ ఫెస్ట్‌ కు హాజరైన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రభావవంతమైన గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రముఖులలో – లోకేష్ గేమర్ (తెలంగాణలో అతిపెద్ద క్రియేటర్), AS గేమింగ్, అడిటెక్, తెలుగు గేమింగ్ FF, ఇషికా ప్లేస్, బాస్ అఫీషియల్, అస్సాసిన్స్ ఆర్మీ, బ్లాక్ ఫ్లాగ్ ఆర్మీ, రాహుల్ గేమింగ్, బక్వాస్ టాక్స్ తదితరులున్నారు. ఈ క్రియేటర్లు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లలో 300 మిలియన్లకు పైగా సామూహిక అనుచరులను కలిగి ఉన్నారు.


భారతదేశంలో గేమింగ్ పరిశ్రమ ఇటీవలి సంవత్సరాలలో విపరీతంగా వృద్ధి చెందుతోంది. 2025 నాటికి $5 బిలియన్లను చేరుకోనుంది. ఈవై నివేదిక ప్రకారం, భారతదేశ కంటెంట్ పరిశ్రమ 2023 నాటికి $30.6 బిలియన్లను దాటనుంది. నేడు మన దేశంలో డిజిటల్ కంటెంట్ సృష్టిలో ప్రధాన భాగం గేమింగ్, ఇస్పోర్ట్స్ క్రియేటర్ల ఆధిపత్యంలో ఉంది. రెండు విభాగాలలో అత్యుత్తమమైన వాటిని అందిస్తూ, స్టాన్ క్రియేటర్ ఫెస్ట్ 2023 భారతదేశ వర్ధమాన క్రియేటర్లకు పుష్కలమైన మద్దతు, ప్రోత్సాహాన్ని అందించడం, మెరుగుపరచ డం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గేమింగ్, కంటెంట్ క్రియేషన్ స్పేస్‌ల కూడళ్లలో నెట్‌వర్కింగ్, మీట్ అండ్ గ్రీట్, సహకారం, జ్ఞానాన్ని పంచుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించింది. అంతేగాకుం డా క్రియేటర్ భాగస్వామి ప్రోగ్రామ్‌ను కూడా స్టాన్ పరిచయం చేసింది. 500 మంది క్రియేటర్లు తనతో కల సి ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ ఈవెంట్ గురించి స్టాన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పార్త్ చద్దా, సహ వ్యవస్థాపకుడు, సీఓఓ శ్రీ నౌమా న్ ముల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్టాన్ క్రియేటర్ ఫెస్ట్ కేవ లం ఒక ఈవెంట్ కాదు; ఇది గేమింగ్ మరియు ఇ-స్పోర్ట్స్ కమ్యూనిటీ క్రియేటర్‌ల శక్తికి నిదర్శనం. మా ప్లాట్‌ఫామ్ వీరికి స్థలాన్ని అందించింది’’ అని అన్నారు.