RC15 టైటిల్ అదేనా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో కియారా అద్వానీ , అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ ఫై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా టైటిల్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తుంది.

మర్చి 27 న చరణ్ బర్త్ డే సందర్బంగా టైటిల్ ను ప్రకటించబోతున్నట్లు వినికిడి. కాగా ఈ సినిమా కు సీఈఓ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాకి సీఈవో అనే టైటిల్.. అన్ని భాషల్లో ఒకేలా ఉండటం ప్లస్ అవుతుందని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నారట. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే ఫైనల్ చేసినట్లు మాట్లాడుకుంటున్నారు దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.