గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియన్‌ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

PM Modi launches ‘Garib Kalyan Rojgar Abhiyaan’ 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి వలస కార్మికుల కోసం ‘గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ ప‌థ‌కాన్ని ఈరోజు ప్రారంభించారు. బీహార్‌లోని క‌గ‌రియా జిల్లాలో ఉన్న తెలిహ‌ర్ గ్రామం నుంచి వీడియోకాన్ప‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కంతో 125 రోజుల ఉపాధి క‌ల్పించ‌నున్నారు. ఆరు రాష్ట్రాల‌కు చెందిన 116 జిల్లాల్లో ఈ ప‌థ‌కం ద్వారా ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పంచ‌నున్నారు. క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల త‌మ స్వ‌స్థ‌లాల‌కు వ‌చ్చిన వ‌ల‌స కూలీల కోసం ఈ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని మోడి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గాల్వ‌న్ లోయ‌లో ప్రాణ త్యాగం చేసిన జ‌వాన్ల‌కు.. ప్ర‌మాణామాలు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడి తెలిపారు. సైనికుల వెంట దేశ ప్ర‌జ‌లు ఉన్నారన్నారు. బీహార్ రెజిమెంట్ ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/