ప్రభాస్ తో ప్రేమాయణం ఫై స్పందించిన కృతి సనన్

టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్లర్ ప్రభాస్ – కృతి సనన్ ల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని గత కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఆదిపురుష్ మూవీ లో నటించారు. షూటింగ్ లో ఇద్దరు ప్రేమలో పడ్డారని..ప్రస్తుతం అదే ప్రేమను కొనసాగిస్తున్నారని , త్వరలోనే ఇద్దరు నిశ్చితార్థం చేసుకుంటున్నారని వార్తలు బలంగా ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తల ఫై కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు ఈ రూమర్లు రావడానికి కారణం వరుణ్ ధావన్ అని ఆమె తెలిపింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వరుణ్ ధావన్ కి బోర్ కొట్టిందట. అప్పుడు వరుణ్.. ఒక రూమర్ ని పుట్టిస్తా అని కృతి సనన్ తో అన్నాడట. కృతి సనన్ మనసులో ఒక హీరో ఉన్నాడు అనే రూమర్ ని పుట్టిస్తా అని అనడంతో దానికి సరే అని అన్నదట కృతి సనన్. అయితే ఈ రూమర్ లోకి ప్రభాస్ ని లాగుతాడని తాను అస్సలు ఊహించలేదని ఆమె వెల్లడించింది. ఐతే వరుణ్ ధావన్ వల్ల ప్రభాస్ తో తన డేటింగ్ అనేది దేశమంతా వైరల్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఈ విషయం ప్రభాస్ కి కాల్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పాలనుకున్నానని, ప్రభాస్ కి కాల్ చేస్తే.. ఎందుకు వరుణ్ మన గురించి అలా అన్నాడు’ అంటూ అడిగారట. అప్పుడు కృతి సనన్ తనకు తెలియదని చెప్పిందట. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.