13 ఏళ్ల బాలుడి తో వివాహిత అక్రమ సంబంధం..

ఈ మధ్య కట్టుకున్న భర్తలు ఉండగానే వారిని కాదని మరొక వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని..చివరకు అడ్డుగా ఉన్న భర్త ను , బిడ్డలను చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా మరో అక్రమ సంబంధం బయటపడింది. కట్టుకున్న భర్త ఉండగానే పక్కింటి 13 ఏళ్ల బాలుడి ఫై వివాహిత కన్నేసి..ఆ బాలుడి తో కోరిక తీర్చుకొని , చివరకు తల్లైన ఘటన అమెరికా కొలరాడో రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఆండ్రియా సెరానో (31) అనే మహిళ .. తన పక్కింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. మెల్ల మెల్లగా అతనితో స్నేహం చేస్తూ.. చివరికి ఆ బాలుడితో సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆండ్రియాను అరెస్ట్ చేశారు. మా కుమారుడి జీవితాన్ని నాశనం చేసిన ఆండ్రియాను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్ట్ లో నడుస్తుంది.