కొవాగ్జిన్‌ ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి

న్యూఢిల్లీ: విదేశాలకు కొవాగ్జిన్‌ టీకాల వాణిజ్య ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్‌ తొలి దేశీయ కరోనా టీకా అయిన కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్‌కు ఈ నెల 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు లభించింది. బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదించిన కరోనా టీకాల జాబితాలో కూడా కొవాగ్జిన్‌ చేరింది. ఇప్పుడు కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో భారత్‌ బయోటెక్‌ త్వరలో కొవాగ్జిన్‌ను విదేశాలకు ఎగుమతి చేయనున్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/