సీఎం యోగి కాళ్లకు మొక్కడంపై రజినీకాంత్ క్లారిటీ

సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా యూపీ సీఎం యోగిని కలిసి ఆయన కాళ్లు మొక్కిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో అయ్యి ఉండి..తన కన్నా చిన్నవాడైన యోగి కాళ్లు మొక్కడం ఏంటి అని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసారు. మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఇదే చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో తాను కాళ్లు మొక్కడం ఫై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. సన్యాసులు, యోగులూ తన కంటే చిన్నవారైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటంటూ ఒక్క ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు.

ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రజినీకాంత్ ఈ మేరకు సమాధానం చెప్పారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. నెల్సన్ డైరెక్షన్లో ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని , వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి వారం లోనే దాదాపు 500 కోట్లు వసూళ్లు చేసి , ఇంకా హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది.