హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను వదలని వరదలు

హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను భారీ వర్షలు , వరదలు వదలడం లేదు. ఈ వరదలకు భారీగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్డడ్స్ ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలోని చంబాలో నిన్న కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు, నాలుగు నెలల చిన్నారి ఉన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగి పడడంతో తెహ్రీ-చంబా మోటార్ రోడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.