తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 69 వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఊరు, వాడ , పల్లె , పట్టణం అనే తేడాలు లేకుండా అంత గులాబీమయం చేసారు. భారీ ప్లెక్సీ లు , కట్ ఔట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలు సేవ కార్య క్రమాలు చేస్తూ వస్తున్నారు. గురువారం సిద్దిపేటలోని జయశంకర్‌ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ కప్‌ సీజన్‌-3 టోర్నమెంట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు, సినీ నటుడు నానితో కలిసి మంత్రి హరీశ్‌రావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

అలాగే సినీ , రాజకీయ , బిజినెస్ నేతలు సైతం కేసీఆర్ కు సోషల్ మీడియా ద్వారా తమ విషెష్ ను అందజేస్తున్నారు.

  • వైస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, కేసీఆర్‌ కు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ట్వీట్‌ చేశారు.
  • ప్రజా జీవితంలో తనదైన పంథాను కలిగిన కేసీఆర్ కు సంతోషకరమైన జీవితం, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుతున్నట్లు జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
  • తెలంగాణ చరిత్రను తిరగరాసిన విజేత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, రాజకీయ చరిత్రలో అయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎంఎల్‌సీ, భారత జాగృతి అధ్యక్షులు కవిత అన్నారు. తెలంగాణ సాధనలో తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసిన సీఎం కేసీఆర్ అందరికీ స్ఫూర్తి దాత అని కవిత అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారత జాగృతి తరపున ఏర్పాటుచేసిన కేసీఆర్ కప్- 2023 వాలీబాల్ టోర్నమెంట్ ను హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో నిర్వహించారు. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్స్ కు విచ్చేసిన ఎంఎల్‌సీ కవిత అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసారు.
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో 18అడుగుల కేసీఆర్ భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలతో అద్భుతంగా చిత్రించాడు అభిమాని రామకోటి రామరాజు. గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఏకంగా 5రోజులు శ్రమించి కేసీఆర్ 18 అడుగుల అతి భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలను అత్యంత అద్భుతంగా చిత్రించి ఆవిష్కరించాడు