లోకరక్షకుడు ఉదయించిన వేళ

నేడు క్రిస్మస్‌ పర్వదినం

Christmas
Christmas

నేడు క్రిస్మస్‌ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు సాదాసీదాగా జరుగుతున్నాయి. కొవిడ్‌-19 మహమ్మారితో ఈఏడాది పండుగను ఆర్భాటంతో కాకుండా సింపుల్‌గా జరుపుకుం న్నారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో కరోనా సెకండ్‌వేవ్‌తో మరింత భయకంపితులను చేస్తుండడంతో క్రిస్మస్‌ పండుగను కొన్నిదేశాల్లో నామమాత్రంగా జరగనున్నాయి.

ఏదిఏమైనా డిసెంబర్‌ మాసమంతా ప్రపంచమంతా క్రిస్మస్‌ వేడుకలు సందడిగా జరిగేవి. ‘సర్వోన్నతమైన స్థలములలో దేవ్ఞనికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక (లూకా 2:14), ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు విూకొరకు పుట్టియున్నాడు.

ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే విూ కానవాలు, ఒక శిశువ్ఞ పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకగొట్టిలో పండుకొనియుండుట విూరు చూచెదరని వారితో చెప్పెను (లూకా 2:11). రెండువేల సంవత్సరాల క్రితం చీకటిలో మగ్గిపోతున్న ప్రజలను రక్షించేందుకు ప్రభువ్ఞ ఈలోకానికి వచ్చాడు.

ఆయన మనందరి దోషాలను తనపై వేసుకుని, సిలువలో మరణించి, పాపం నుంచి మనల్ని విడిపించి, రక్షించాడు. ఈ అనుభవాన్ని పొందిన ప్రతివారికి క్రిస్మస్‌ అనుభూతిని తప్పనిసరిగా వుంటారు. అసలు యేసుప్రభువుజన్మదినాన్ని జరుపుకున్నట్లుగా మనకు బైబిల్‌లో ఎక్కడా కనిపించదు. అయితే ప్రభువుజన్మించినప్పుడు తూర్పుదేశపు జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించారు.

నక్షత్రం వారికి దారిచూపింది. మరియ, శిశువ్ఞ చెంతకు వీరిని నక్షత్రమే నడిపించింది. జ్ఞానులు శిశువును చూసి, బంగారం, సాంబ్రాణి, బోళమును సమర్పించి, ఆరాధించారు. అనంతరం దూత గొర్రెలకాపరులకు యేసుప్రభువు జన్మించిన విషయాన్ని చెప్పడంతో వారు ప్రభువు చెంతకు చేరి, శిశువును చూసి, మహిమపరిచారు

అంతమాత్రమే కాదు, తమ స్వస్థలాలకు వెళ్లి, ప్రభువును ప్రకటించారు. క్రిస్మస్‌ అంటే ప్రభువును ఆరాధించడం. హద్దులు లేని ఆర్భాటాలతో అర్థం పర్థం లేని అల్లరితోకూడిన ఆటపాటలతో వేడుకలను జరుపుకోవడం విచారకరం.

సువార్తను ప్రకటించాలనే గొప్ప ఉద్దేశంతో పండుగ అనే సంప్రదాయం క్రిస్మస్‌ సీజన్‌గా ఆరంభమైందే తప్ప లోకంతోపాటు మనం నశించిపోవాలని కాదు. భూమిమీద జన్మించిన ప్రభువురక్షకుడిగా మన హృదయంలో కూడా ఉదయించాలి. అప్పుడే రక్షణ ఆనందంతో నిత్యం ప్రభువ్ఞను ఆరాధించగలం. ఇలాంటివారికి ప్రతిరోజూ ఒక క్రిస్మస్‌ వేడుకగానే ఉంటుంది.

అవును దేవాదిదేవుడు మనకోసం పాపపులోకంలో జన్మించాడు. ఆదిమానవ్ఞడు ఆదాము, హవ్వలు దేవ్ఞడు తినవద్దన్న పండును తిని, పాపంచేసారు. ఆనాటి నుంచి మానవ్ఞడిలో మరణభయం వెంటాడుతూనే ఉంది. ఈ భయాన్ని తొలగించేందుకు ప్రభువ్ఞ జన్మించాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకు నూతన జన్మ కలిగింది.

రక్షణ అనే భాగ్యం లభించింది. మరణభయం లేదు. చనిపోతే ప్రభువువద్ద ఉంటామనే గొప్ప నిరీక్షణ మనకు కలిగింది. ఇలాంటి అనుభవం లేనివారు కనీసం ఈ సీజన్‌లో అయినా ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. ప్రభువురాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు.

నేడు అనే సమయం ఉండగానే ప్రభువ్ఞ చెంతకు చేరాలి. కరోనా తెగులు ప్రభువ్ఞ రాకడను సూచించే ఒక సూచకక్రియ. ఇంకా ఎందుకు నిర్లక్ష్యం? లోబడని ప్రజల కోసం చేతులు చాచి ప్రభువ్ఞ తన వద్దకు రావాలని కోరుతున్నాడు. జ్ఞానులు, గొర్రెలకాపరులు ప్రభువును ఆరాధించినట్లుగా మనం కూడా ఆయనను మనస్ఫూర్తిగా స్తుతిద్దాం.

శాంటాక్లాజ్‌, క్రిస్మస్‌ ట్రీలకు ఇస్తున్న ప్రాధాన్యత నిజదేవ్ఞడికి ఇవ్వకపోవడం విచారకరం. శాంటాక్లాజ్‌ అసలు పేరు సెయింట్‌ నికోలస్‌. ఈయన ప్రభువ్ఞ ను వెంబడించిన శిష్యుడు. పేదలకు తన సంపాదనలో సగభాగం కానుకల రూపం లను ఇచ్చిన ఒక మానవతా వాది. చివరికి అందరినీ నవ్వించే తాతగా మార్చేశాం.

క్రిస్మస్‌ వేడుకలు అంటూ రోడ్లపై, స్టేజీలపై సినిమాస్టైల్లో నృత్యాలు చేస్తూ, దేవ్ఞడిని అవమానపరు స్తున్నాం. తూర్పుదేశపు జ్ఞానులు ప్రభువ్ఞను చూసి సాగిలపడి ఆయనను పూజించారు. దేవుడిని ఆరాధించేందుకు తూర్పుదేశం నుంచి ప్రయాణం చేసి వచ్చారు.

తనను మహిమపరచాలని దేవ్ఞడు కోరుతున్నాడు. కరోనాను బట్టి ఇంకా కొంతమంది చర్చిలకు వెళ్లలేకపోతున్నారు. ఎక్కడ ఉన్నా ఆత్మతో, సత్యముతో యేసుప్రభువును ఆరాధించేందుకు ప్రభువుసాయం చేయునుగాక

– పి.వాణీపుష్ప

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/