విజయ్ కొత్త పార్టీ ఫై సూపర్ స్టార్ రజనీకాంత్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల ఆయన అభిమానులు , తమిళ్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విజయ్ పొలిటికల్ ఎంట్రీ స్పందిస్తూ వస్తున్నారు . చిత్రసీమ నుండి ఇప్పటికే ఎంతోమంది కళాకారులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా , ఎంతో ఉన్నంత స్థాయికి చేరుకొని ప్రజలకు సేవ చేసారు. ప్రస్తుతం తెలుగు తో పాటు పలు భాషల్లోని నటి నటులు రాజకీయాల్లో రాణిస్తుండగా..తాజాగా కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ వెల్ కం చెపుతున్నారు.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. కొత్త పార్టీ పెట్టిన విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేసారు. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాలో నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ విమానాశ్రయంలో దిగిన రజనీకాంత్‌ను మీడియా ప్రతినిధులు విజయ్ కొత్త పార్టీ గురించి ప్రశ్నించారు. స్పందించిన రజనీకాంత్ అతనికి కంగ్రాట్స్ చెబుతున్నానని పేర్కొన్నారు. రెండుసార్లు కంగ్రాట్స్… కంగ్రాట్స్ అన్నారు.

అలాగే చరణ్ భార్య ఉపాసన సైతం విజయ్ ఎంట్రీ ఫై స్పందించారు. ‘విజయ్ సినిమా రంగంలో గొప్పగా రాణించారు. ఇప్పుడు ప్రజల మనసులో స్థానం సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చారు. నా మామయ్య (చిరంజీవి), అంకుల్ (పవన్ కళ్యాణ్) కూడా రాజకీయాల్లో ప్రవేశించారు. చాలా మంది గొప్ప సీఎంలు సినిమా బ్యాండ్ ఉన్నవారే’ అని తెలుపుతూ విజయ్ అల్ ది బెస్ట్ తెలిపారు.