ఈఏపీ​సెట్ షెడ్యూలు విడుదల

apcet-schedule-release-in-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ షెడ్యూలు విడుదల చేసింది. ఈనెల 21న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు ఎప్ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల ఎంసెట్ పేరును ఈఏపీసెట్​గా మార్చిన సంగతి తెలిసిందే.