ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం కర్నూల్ లో విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు. కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/