కాంగ్రెస్ నేతలకు బిజెపిలోకి చేరాలని రాజగోపాల్ రెడ్డి పిలుపు

Rajagopal Reddy calls on Congress leaders to join BJP

Community-verified icon


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏంజరుగుతుందో అర్ధం కావడం లేదు. ఓ పక్క ముందస్తు ఎన్నికలు అంటూ హడావిడి నడుస్తున్నాయి. బిజెపి , టిఆర్ఎస్ పోటాపోటీ జనాల్లోకి వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం గొడవలతో కాలం గడుపుతున్నారు. తాజాగా టి కాంగ్రెస్ రెండు వర్గాలుగా మారింది. ఓవైపు సీనియర్లు.. మరోవైపు రేవంత్ వర్గంగా మారింది. ఈ క్రమంలో మాజీ కాంగ్రెస్ నేత , ప్రస్తుత బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..కాంగ్రెస్ నేతలకు బిజెపిలోకి రావాలని ఆహ్వానం అందించారు.

రేవంత్ రెడ్డి కింద పనిచేయడం కంటే రాజకీయమే మానేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదని.. ఇప్పుడు ఆలోచిస్తున్నారని చెప్పారు. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకుండు అని రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. కేసీఆర్ అవినీతి బయటకు తీయాలంటే బీజేపీతోనే సాధ్యం అని , కుటుంబపాలన పోయి ప్రజాస్వామ్య పాలన కావాలంటే బీజేపీతో పని చేయాలని చెప్పారు. తెలంగాణలో ఏమి ఒరగపెట్టాడని దేశ రాజకీయాలకు పోతుండు అని మండిపడ్డారు.