నేడు దలైలామా పుట్టినరోజు.. చైనా ఆందోళన!

న్యూఢిల్లీ: భారత్ చైనాల మధ్య లడఖ్ సరిహద్దు వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే చైనాపై నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో.. నేడు టిబెటన్ల గురువు దలైలమా 85వ పుట్టిర రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా… హిమాచల్ ప్రదేశ్లేలోని ధర్మశాలలో జరిగే కార్యక్రమాలకు భారత్ మద్దతుగా నిలవడం ఏటా జరిగేదే. అయితే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి చైనాకు కంటగింపుగా మారాయనే వార్తలు వినిపిస్తున్నాయి. టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా నిరంతరం దలైలామాను వ్యతిరేకిస్తూ వస్తోంది. దలైలామా తన పుట్టినరోజు సందర్భంగా టిబెట్ స్వాతంత్య్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనైనా చేయవచ్చని చైనా మరోసారి ఆందోళన పడుతోందని సమాచారం. ఈసారి దలైలామా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఆన్లైన్ స్క్రీనింగ్‌ను ప్లాన్ చేశారు. అ సమాచారాన్ని దలైలామా ట్విట్టర్ ద్వారా ముందుగానే తెలియజేశారు. ఈ నేపధ్యంలో దలైలామాను వ్యతిరేకిస్తూ చైనా ఏదో ఒకటి చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/