జనవరి 26 నుండి రేవంత్ పాదయాత్ర

జనవరి 26 నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు యాత్ర చేయనున్నారు. రెండు నెలలు పాటు రేవంత్ ‘హాత్ మే హాత్ జోడో’ పేరిట పాదయాత్ర చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు త్వరలోనే యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించే చాన్స్ ఉంది.

ఇదిలా ఉంటె కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ ఫై ఆగ్రహం గా ఉన్నారు. నిన్న భట్టి నివాసం లో భేటీ అయ్యి..టిడిపి నుండి వచ్చిన వారికీ పదవులు ఇచ్చారని , కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నవారికి ద్రోహం చేసారని పలువురు ఆరోపించారు. వీరి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ‘హాత్ సే హాత్ జోడో’ సమావేశానికి హాజరైన పలువురు నేతలు తమ పదవులకు రాజీనామా చేసారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏ పదవి లేకపోయినా పనిచేస్తానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సీనియర్లు తమపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లనే తాము రాజీనామా చేశామని ఆమె చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేయని వాళ్లు కూడా మాట్లాడితే ఎలా సహించేదని సీతక్క ప్రశ్నించారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారి జాబితాలో వేం నరేందర్ రెడ్డి (పీఈసీ మెంబర్), ఎమ్మెల్యే సీతక్క(పీఈసీ మెంబర్), విజయ రమణారావు ( టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), దొమ్మాటి సాంబయ్య (టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), వజ్రేశ్ యాదవ్ (టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), చారగొండ వెంకటేశ్ (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), సత్తు మల్లేశ్ (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), శశికళ యాదవ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), చిలుక మధుసూదన్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), పటేల్ రమేశ్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), సుభాష్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), కవ్వంపల్లి సత్యనారాయణ (డీసీసీ ప్రెసిడెంట్ కరీంనగర్) ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ కు పంపారు.