రాష్ట్రంలోమూడు రోజుల పాటు వానలు వర్షాలుః వాతావరణ శాఖ

Heavy-Rain
Heavy-Rain

హైదరాబాద్ః తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు వానలు పడతాయని పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీన గంటకు 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో..ఏప్రిల్ 26వ తేదీన, ఏప్రిల్ 27వ తేదీన 30 నుండి 40 కిలోమీటర్ల వేగం తో గాలులు వీస్తాయని దీంతో పాటు.. వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ఏప్రిల్ 25వ తేదీ ఉపరితల ద్రోణి పశ్చిమ విధర్బ లోని ఆవర్తనం నుండి మరాఠ్వాడ మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ,..ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయిని పేర్కొంది.