శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం

శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ బ్లాక్ సముదాయంలో ఉన్న లలితాంబికా దుకాణంలో బుధవారం ఆర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో సుమారు 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగిన దుకాణాలు వద్దకు చేరుకున్న ఈవో లవన్న.. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఇక దుకాణాల దగ్ధంతో సుమారు 1 కోటి నుండి 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం అందుతోంది.