కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదు – అసోం సీఎంకు నందు బిలాల్ హెచ్చ‌రిక‌

గణేష్ శోభాయాత్రలో భాగంగా భాగ్యనగరానికి అసోం సీఎం నందు బిలాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యంలో పూజ‌లు చేసిన అనంత‌రం మొజాంజాహీ మార్కెట్ వ‌ద్ద‌ భాగ్య‌న‌గ‌ర్ ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వేదిక‌పై ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాడారు. అక్కడే ఉన్న గోషామ‌హ‌ల్ టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు నందు బిలాల్ వేదిక‌పైకి వెళ్లి.. మైక్‌ను లాక్కున్నారు. కేసీఆర్ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మీకు మాట్లాడే అర్హ‌త లేద‌ని.. వేదిక‌పైనే అసోం సీఎంను నందు బిలాల్ హెచ్చ‌రించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతవరణం చోటుచేసుకుంది. అనంత‌రం పోలీసులు నందును అదుపులోకి అబిడ్స్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

మరోపక్క టిఆర్ఎస్ మంత్రి తలసాని సైతం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం ఏంటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలెవరూ క్షమించరని అన్నారు. గణేష్ నిమజ్జన వేదికపై రాజకీయాలు చేయడం పద్ధతి కాదన్నారు. ‘అస్సాం రాష్ట్రానికి వెళ్లి మేము కూడా మాట్లాడొచ్చు. కానీ, మాకు సంస్కారం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.