నేడు తెలంగాణకు వర్ష సూచన

Heavy-Rain
Heavy-Rain

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించి ఉండగా, రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. దీంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్‌, మంచిర్యాల‌, నిజామాబాద్, జగిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల, పెద్దపల్లి, క‌రీంన‌గ‌ర్‌, జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి, ములుగు, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, జ‌న‌గామ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/