తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టీకరణ

telangana-high-court
telangana-high-court

హైదరాబాద్‌: కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. మీడియా బులెటిన్ లో కరోనాపై కీలక సమాచారం తప్పకుండా పొందుపరచాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరాలను కాలనీ సంఘాలకు అందించాలని తెలిపింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ చెప్పిందని, ఐసీఎంఆర్ సూచనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. గాంధీ ఆసుపత్రితో పాటు 54 ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేగాకుండా, సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/