తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్

రెండు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు తీపి కబురు తెలిపింది. ఇరు రాష్ట్రాల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఒకటి శంషాబాద్– విజయవాడ-లను కలుపుతూ ఒక రూట్, విజయవాడ-కర్నూలును కలుపుతూ మరో రూట్ సర్వేకుఆమోదం తెలిపింది. ఈమేరకు గురువారం దక్షిణ మధ్య రైల్వే కు రైల్వే బోర్డు లెటర్ రాసింది. ఈ 2రైల్వే లైన్ల నిర్మాణానికి అధికారులు సుమారు 942 కి.మీ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయాలని చూస్తుంది.

సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రాజెక్టుపై రైల్వే బోర్డు ముందుకు సాగనుంది. కాగా, ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల విషయంలో తాను పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి లేఖలు సమర్పించినట్లు ఈ సందర్బంగా తెలిపారు.