తెలంగాణ లో మూడు భారీ సభలకు బిజెపి ప్లాన్ ..

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో బిజెపి దూకుడు పెంచుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాస్త నిరాశ పడిన క్యాడర్..పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఈ నెలలో తెలంగాణ లో మూడు భారీ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది.

ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ లేదా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకర్గంలో, దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని ఒక పార్లమెంట్ స్థానంలో, కర్నాటక సరిహద్దులో ఉన్న జహీరాబాద్ లేదా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో సభలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. వీటికి చీఫ్ గెస్టులుగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. త్వరలో దీనిపై పార్టీ హైకమాండ్‌ను అనుమతి కోరనుంది.