అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలకు మొదలయ్యాయి. నేటి నుండి 21రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్, దండే విఠల్, నవీన్ కుమార్, రఘోత్తం రెడ్డి, శాసన సభ కార్యదర్శి డాక్టర్‌ నరసింహా చార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్‌ రెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాసేపట్లో సెక్రటేరియట్ లో కేసీఆర్ జెండా ఆవిష్కరించనున్నారు. గోల్కొండ కోటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ఆవతరణ దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించారు. రాజ్ భవన్ లో వేడుకలను గవర్నర్ తమిళి సై ప్రారంభించనున్నారు.