ఈరోజు తో రాహుల్ భారత్‌ జోడో యాత్ర పూర్తి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు తో ముగుస్తుంది. గత కొద్దీ రోజులుగా జమ్మూ లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా కాసేపట్లో శ్రీనగర్‌ లాల్‌చౌక్‌ చేరుకుంటారు. ఇక్కడితో రాహుల్ పాదయాత్ర ముగుస్తుంది. సెప్టెంబర్ 7 2022 న కన్యాకుమారిలో రాహుల్ యాత్ర ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించింది.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు దాదాపు 3,570కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగింది. ఈ యాత్ర లో సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్‌ వాద్రాతో పాటు పలువురు కాంగ్రెస్‌ అగ్ర నేతలు పాల్గొన్నారు. దాదాపు 145 రోజుల పాటు సాగిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని యాత్ర ను సక్సెస్ చేసారు. ఇక రేపు శ్రీనగర్‌లో కాంగ్రెస్ నేతలు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 21ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు.