ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : రీ రిలీజ్ కాబోతున్న ‘ ఆంధ్రావాలా’

ఇటీవల ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన చిత్రాలు రీ రిలీజ్ అయ్యి అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా చిత్రం ఈ నెల చివర్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్స్ అప్పట్లో ఫిదా కానీ వారు లేరు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికి చాల చోట్ల మారుమోగిపోతుంటాయి. ఈ క్రమంలో ఈ సినిమాను మరోసారి అభిమానులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ జోష్​లో ఉన్న ఎన్టీఆర్..అతి త్వరలో కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ చిత్రం చేయబోతున్నాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.