అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు వర్మ రిక్వెస్ట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు రిక్వెస్ట్ చేసారు. అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ.. అతన్ని అరెస్ట్‌ చేయాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్‌ చేసాడు. పోలీసులను తిట్టడం ద్వారా వారికి భవిష్యత్తులో సరైన విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచంలో ఎవ్వరు ఇలా దూషించిన సంఘటనలు లేవు అని వర్మ అన్నాడు.

‘ఏపీ పోలీస్ గన్ మెన్ లకి, వాళ్లని డిప్లాయ్ చేసే ఆఫీసర్లకి నేను చెప్పేదేంటంటే మీలో ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా అయ్యన్న పాత్రుడి గాడికి , #బిచ్చంనాయుడికి సెక్యూరిటీ ఇవ్వకుండా వాళ్ల రౌడీల యెనక దాక్కోమని చెప్పండి ‘ అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై టీడీపీ కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు ట్వీట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడవబోతున్నాడని..రాత్రి కలలో దేవుడు చెప్పాడంటూ పోస్ట్ చేసాడు. ఇలా వరుసగా టీడీపీ , జనసేన పార్టీల ఫై వర్మ పోస్టులు పెడుతూ ఆయా పార్టీల కార్యకర్తల్లో , నేతల్లో కోపం తెప్పిస్తున్నాడు.