శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో సిఎం కెసిఆర్‌ ప్రత్యేక పూజలు

Telangana CM KCR to visit Vitthal Rukmini temple in Maharashtra’s Pandharpur

మంబయిః సిఎం కెసిఆర్‌ మహారాష్ట్రలో రెండో రోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు (మంగళవారం) ఉదయాన్నే సోలాపూర్‌ నుంచి పండరీపూర్‌ చేరుకున్నారు. పండరీపూర్‌లోని శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. సీఎం ఆలయానికి వెళ్లిన సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పలువురు మరాఠీ భక్తులు సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. ప్రత్యేక పూజ‌ల అనంతరం స‌మీప గ్రామంలో పార్టీ కార్యకర్తల‌తో సీఎం స‌మావేశం కానున్నారు. అక్కడ స్థానిక నేత‌లు బిఆర్ఎస్ పార్టీలో చేర‌నున్నారు. మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు శ‌క్తిపీఠం తుల్జాపూర్ భ‌వానీ ఆల‌యానికి వెళ్లి అమ్మవారిని ద‌ర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్రలోని భార‌త రాష్ట్ర స‌మితి కార్యక‌ర్తలు భారీ స్థాయిలో పండ‌రీపురం చేరుకున్నారు