ఎన్టీఆర్ 30 వ మూవీ లో అనుపమ ఖేర్..?

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ మూవీ చేయబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా ..స్క్రిప్ట్ లో చేంజెస్ చేయమని ఎన్టీఆర్..కొరటాల ను కోరడం తో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడం తో సినిమాను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి రెండో వారంలో సినిమాను అట్టహాసంగా ప్రారభించబోతున్నారు. ఈ మూవీ ప్రారంబోత్సవానికి ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా హాజరు కానుందని సమాచారం.

దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన ఫ్యామిలీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సహా RRR టీమ్ మొత్తం #NTR30 సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందట. ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌ జరగబోతుంది. అలాగే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించవచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటె ఈ మూవీని పాన్ ఇండియా గా రిలీజ్ చేయబోతున్నారు. అందుకు గాను ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులతో పాటు ఇతర భాషల నటి నటులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ లో అనుపమ ఖేర్ ను ఎంపిక చేశారట. ఈ మధ్య అనుపమ ఖేర్ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇక నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.