ప్రధాని తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటున్నారు

మేము గనుక అధికారంలో ఉంటే 15 నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం..రాహుల్ గాంధీ

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్యానా పర్యటనలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోడిపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్‌చైనా మధ్య తూర్పు లడఖ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గురించి ఆయన ప్రస్తావించారు. ‘మన దేశ భూభాగాన్ని ఎవ్వరూ తీసుకోలేదని ఈ పిరికి ప్రధాని చెబుతున్నారు. ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకుంది. అలా భూమిని కోల్పోయిన దేశం ప్రపంచంలో ఈవేళ ఒక్కటే ఉంది. అయినప్పటికీ, మన దేశ ప్రధాని తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటున్నారు. మేము గనుక అధికారంలో ఉంటే చైనాను 15 నిమిషాల్లో తరిమేసేవాళ్లం’ అని రాహుల్ గాంధీ చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/