ఛత్తీస్‌గఢ్‌ లో హోమ్ థియేటర్ పేలుడు ఘటన : పథకం ప్రకారమే బాంబ్ పెట్టాడు..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లాలోని చమరి గ్రామంలో హోమ్ థియేటర్ పేలిన ఘటన లో పెళ్లి కొడుకుతో పాటు ఆయన తమ్ముడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా..పథకం ప్రకారమే హోమ్ థియేటర్ లో బాంబ్ పెట్టినట్లు తేల్చారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లాలోని చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి(22), అంజనా అనే యువతిని శనివారం వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ లు ఓపెన్ చేయగా..అందులో హోమ్ థియేటర్ వచ్చింది. తీరా అది ఆన్ చేయగా ఒక్కసారిగా పేలింది, ఈ ఘటన లో పెళ్లి కొడుకుతో పాటు ఆయన తమ్ముడు మరణించారు.

పక్కా ప్రణాళిక ప్రకారం హోమ్ థియేటర్ లో బాంబు పెట్టారని పోలీసులు తేల్చారు. సర్జు మార్కం (33) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సర్జుకి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే హేమేంద్రని పెళ్లి చేసుకున్న అంజనా మేరావి.. పెళ్ళికి ముందు నుంచి సర్జుతో కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉంది. అయితే హేమేంద్రతో పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఇక్కడితో రిలేషన్ షిప్ ని ఎండ్ చేద్దామని సర్జుకి చెప్పింది. అయితే పెళ్ళికి వారం రోజుల క్రితం అంజనా, సర్జుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సర్జు.. ప్రియురాలు అంజనా, హేమేంద్రల మీద పగ పెంచుకున్నాడు. ఇద్దరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని మాండై మార్కెట్లో హోమ్ థియేటర్ మ్యూజిక్ సిస్టం కొన్నాడు. పెట్రోల్ లో నానబెట్టిన రెండు కిలోల పేలుడు పదార్థాన్ని ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ లో పెట్టి హోమ్ థియేటర్ లో అమర్చాడు. స్విచ్ ఆన్ చేస్తే హోమ్ థియేటర్ పేలిపోయి వధూవరులిద్దరూ చనిపోయేలా బాంబు పెట్టాడు. కానీ బాంబ్ పేలిన ఘటన లో వరుడు, అతని సోదరుడు మాత్రమే చనిపోయారు. హోమ్ థియేటర్ కొన్న దుకాణం యొక్క పేరుని తెలుసుకుని ఆరా తీయగా సర్జు కొన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కి 100 కి.మీ. దూరంలో సర్జుని అదుపులోకి తీసుకున్నారు. హత్యా నేరం కింద సెక్షన్ 302, ఇతర సెక్షన్లతో అరెస్ట్ చేశారు.