గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీలు

తాము గుజరాత్ ప్రజల కోసమే పనిచేస్తామన్న రాహుల్

rahul-gandhi

న్యూఢిల్లీః త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హామీలను అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. గుజరాత్ లోని సోదరసోదరీమణులందరికీ ఈ మేరకు మాటిస్తున్నాం అంటూ పరివర్తన్ సంకల్ప్ సమ్మేళన్ పేరిట కీలక అంశాలను ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల హామీలు…

.రూ.500 కే గ్యాస్ సిలిండర్

.300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

.రూ.10 లక్షల ఖర్చు వరకు ఉచిత వైద్యం

.రూ.3 లక్షల వరకు రైతులకు రుణ మాఫీ

రాష్ట్రంలో 3 వేల ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు

.కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం

.లీటర్ కు రూ.5 చొప్పున పాల ఉత్పత్తిదారులకు సబ్సీడీ

.ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి. నిరుద్యోగులకు రూ.3,000 భృతి.

ఇవే తమ తీర్మానాలు అని, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము గుజరాత్ ప్రజల కోసమే పనిచేస్తామని, బిజెపి లాగా కేవలం ఇద్దరు ముగ్గురు స్నేహితుల కోసం పనిచేయబోమని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/