రాజేంద్రనగర్‌లో దారుణం : అనుమానంతో భార్యను చంపి..ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త

భార్య భర్తల మధ్య అనుమానం అనేది ఉండకూడదు..ఆలా ఉంటె ప్రతి విషయం ఇద్దరి మధ్య గొడవలకు దారితీస్తాయి. అక్కడి తో ఆగకుండా ఒక్కోసారి ఆవేశం తో చంపడాలా వరకు వెళ్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త..ఆమె నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా చంపి..ఆమె తలను తీసుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే..

14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను ఫర్వేజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఫర్వేజ్​కు భార్యపై అనుమానం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తరచూ గొడవలు జరిగేవి. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వెళ్లిన అతను.. భార్య నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అప్పటికి కసితీరక సమ్రిన్ తలను శరీరం నుంచి వేరుచేశాడు. అనంతరం తలను తీసుకుని పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి లొంగిపోయాడు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో ఫర్వేజ్ హత్య చేసినట్లు స్థానికులు చెపుతున్నారు. మృతురాలు సమ్రీన్ బేగంకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.