బన్నీ కి ఎన్టీఆర్ బర్త్ డే విషెష్..పార్టీ లేదా పుష్పా? అంటూ ట్వీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం తన 41 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఆయనకు బర్త్ డే విషెష్ అందించారు. ఈ క్రమంలో జూ. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు.

‘‘హ్యాపీ బర్త్‌డే బావా. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’’ అని ట్వీ్ట్ చేశారు. దీనికి రిప్లైగా బన్నీ..‘‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్’’ అని చెప్పారు. వెంటనే రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్..కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్పా? అంటూ పుష్పా డైలాగ్‌ను గుర్తుకు తెస్తూ ట్వీ్ట్ చేశారు. దీంతో.. బన్నీ కూడా ‘‘వస్తున్నా’’ ఎన్టీఆర్ 30లోని డైలాగ్‌ను గుర్తుకు తెచ్చేలా సమాధానమిచ్చారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఫన్నీ గా ట్వీట్స్ చేసుకోవడం అభిమానులను ఎంతో సంతోష పెట్టింది.

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 తో బిజీ గా ఉన్నారు. బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ సినిమా ఫై అమాంతం అంచనాలు రెట్టింపు చేసింది. మరోపక్క ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ చిత్రం చేస్తున్నాడు.