నిజామాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌కు సిఎం కెసిఆర్‌ ప్రారంభోత్సవం

cm-kcr-inaugurates-integrated-district-offices-complex-at-nizamabad-district

నిజామాబాద్ః సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌కు నేడు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎంవో అధికారి స్మితా సబర్వాల్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల్లో సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్లను నిర్మించేందుకు నిర్ణయించిన విషయం విధితమే. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించింది.

కాగా, ఇటీవల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రాగా.. సిఎం కెసిఆర్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ సీ నారాయణరెడ్డిని కూర్చుండబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి.. శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/