న్యూడ్ వీడియో వ్యవహారంపై జగన్ వెంటనే స్పందించాలిః రఘురామకృష్ణరాజు

రెండు వీడియోలను వేరే రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలన్న రఘురాజు

mp-raghu-rama

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక యువతితో న్యూడ్ వీడియోలో మాట్లాడారంటూ ఆరోపణలు రావడంతో సదరు ఎంపీ మాధవ్ వాటిని ఖండించారు. అది మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను మీడియాకు చూపించారు. ఒక కుట్ర ప్రకారమే తనపై ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు

మరోవైపు ఈ అంశంపై, వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ… గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు… మీడియాకు గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకు అసలు సంబంధమే లేదని అన్నారు. వీటిలో ఏది ఒరిజినల్ వీడియో అనేది తేలాలంటే…. రెండు వీడియోలను వేరే రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని చెప్పారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుందని అన్నారు. పార్లమెంటు సాక్షిగా గోరంట్ల మాధవ్ తనను బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ న్యూడ్ వీడియో వ్యవహారంపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/