పోలీసు కమాండ్‌ కంట్రోల్ సెంటర్​ను ప్రారంభించిన సిఎం కేసీఆర్

https://youtu.be/PuuTTXN3ibY
CM Sri KCR Participating in Inauguration of Telangana State Police Integrated Command Control Center

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నేడు ప్రారంభించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం…కమాండ్‌ కంట్రోల్‌ నమూనాను పరిశీలించారు. కేంద్రంలో మంత్రులు, అధికారులతో కలిసి కలియ తిరిగారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/