లండన్కు చేరుకున్న క్వీన్ ఎలిజబెత్–2 పార్థివదేహాం..రాజవంశీయుల నివాళి

Queen Elizabeth’s Coffin Arrives At Buckingham Palace

లండన్‌ః క్వీన్ ఎలిజబెత్–2 పార్థివదేహాం స్కాట్ లాండ్ లోని ఎడిన్ బరో నుంచి గత రాత్రి సైనిక రవాణా విమానంలో లండన్ కు చేరింది. క్వీన్ శవపేటికను కింగ్ ఛార్లెస్.. ఆయన భార్య కెమిల్లా అందుకున్నారు. క్వీన్ డెడ్ బాడీని బకింగ్ హం ప్యాలెస్ లోని బౌ రూంలో ఉంచారు. రాజవంశీయులందరూ నివాళులు అర్పిస్తున్నారు. క్వీన్ గార్డెన్స్, దమాల్, హార్స్ గార్డ్స్, వైట్ హాల్, పార్లమెంటు స్ట్రీట్, పార్లమెంట్ స్క్వేర్, న్యూ ప్యాలెస్ యార్డ్ మీదుగా శవపేటికను ఊరిగేంపుగా.. పార్లమెంటు బిల్డింగ్ వెస్ట్ మినిస్టర్ కు తరలిస్తారు. ఇందుకోసం సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. వెన్స్ట మినిస్టర్ నుంచి స్థానిక టవర్ బ్రిడ్జి వరకూ సుమారు 5 కిలోమీటర్ల క్యూ ఏర్పడుతుందని భావిస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 అంత్యక్రియలు సెప్టెంబర్ 19న జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పపువా న్యూగినియా నేతలు క్వీన్ ఎలిజిబెత్ కు నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కింగ్ ఛార్లెస్–3 ని తమ రాజ్యాధినేతగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా, దాని మిత్రదేశ బెలారస్, సైనిక పాలన ఉన్న మయన్మార్ దేశాలకు క్వీన్ అంత్యక్రియలకు ఆహ్వానం పంపలేదని… స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/